Tomiko: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కన్నుమూత ..! 1 d ago
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరొందిన టోమికో (116) ఇక లేరు. జపాన్ కు చెందిన ఈమె వృద్ధాప్య సమస్యలతో డిసెంబరు 29న మృతి చెందినట్లు అక్కడ అధికారులు వివరించారు. ఆమె 1908మే 23న ఒసాకోలో జన్మించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం గత ఏడాది స్పెయిన్ దేశస్ధురాలైన బ్రన్యాస్(117) మృతి చెందడంతో అత్యంత వద్ద మహిళగా టోమికో ఇతోకా పేరొందారు. ఇటీవల ఆమె జన్మదిన వేడుకలను నిర్వహించిన నేపధ్యంలో పలువురు ప్రముఖులు ఆమెకు పుష్పగుచ్ఛాలు ఇచ్చారు.